పదో తరగతి ఫలితాలలో విజయ ఢంకా మ్రోగించిన తూప్రాన్ గీతా విద్యార్థులు
రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి ముందు వరసలో నిలిచిన తూప్రాన్ గీతా స్కూల్ విద్యార్థులు
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, ఏప్రిల్, 30.
బుధవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాలలో తూప్రాన్ గీతా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. పి. నిషాంత్ 600 మార్కులకు గాను 588 మార్కులు సాధించగా కే.చక్రవర్ధన్ 585 మార్కులతో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. మరో 28 మంది విద్యార్థులు 550 కి పైగా మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పి.రామాంజనేయులు, చైర్ పర్సన్ పి.ఉష , డైరెక్టర్లు బి.రాఘవేందర్ గౌడ్, కె.నారాయణ గుప్త , ప్రిన్సిపాల్ సి.హెచ్.వెంకట కృష్ణారావు, ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.




Post Comment