ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్డీవో రమాదేవి
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్ 10
మెదక్ శివాయిపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో రమాదేవి సంబంధిత అధికారులు కలిసి ప్రారంభించారు ఆర్డిఓ రమాదేవి స్వయంగా ధాన్యాన్ని శుభ్రం చేసే యంత్రంలో వేసి శుభ్రపరిచారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
రైతులు కొనుగోలు కేంద్రానికి నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని సూచించారు నియోజకవర్గంలో ప్రతి రైతుకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు చివరి గింజ వరకు కొంటామని అన్నారు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు అలాగే సన్నరకం వరి పండించిన రైతులకు 500/- బొనస్ ఇస్తున్నామని చెప్పారు
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment