తెలంగాణ సర్కార్ దేశానికి ఆదర్శంగా నిలిచింది..GCR
తెలంగాణ సర్కార్ దేశానికి ఆదర్శంగా నిలిచింది…
◆నాపై నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తా…Gaddam Chandrashekar Reddy.
ప్రజా సింగిడి – కామారెడ్డి
నాపై నమ్మకంతో ఇచ్చిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది నాకు పదవి అని కాకుండా పార్టీ నాపై పెట్టిన బాధ్యతగా… కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి…నాయకులు, కార్యకర్తలతో కలిసి కృషి చేస్తాను అని, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అభివృద్ధి కోసం ఆహార్నిషలు కృషి చేస్తాను అన్నారు.
రాహుల్ గాంధీ ఆలోచనతో ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, బీసీ కులగణన చేసి తెలంగాణ సర్కార్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తాననీ, నాపై నమ్మకంతో టీ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన కాంగ్రెస్ అధిష్టానంకు ధన్యవాదములు. పార్టీ బలోపేతానికి, తెలంగాణ పీసీసీ, ఎఐసీసి ఇచ్చే కార్యక్రమాలు తుచా తప్పకుండ అమలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తన వంతు కృషి చేస్తాను. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కి, తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కి, సీఎం రేవంత్ రెడ్డి కి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణరావ్ కి, ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ కి, రాష్ట్ర, జిల్లా నాయకత్వంకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపుకు ముఖ్యం గా సర్పంచ్ నుంచి మొదలుకొని ఎంపీటిసి, జడ్పిటిసి, మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేస్తాను. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర, జాతీయ నాయకత్వం కు రుణ పడి ఉంటానన్నారు. కామారెడ్డి ప్రాంతం అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ ల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి నిధులు తీసుకొచ్చేలా కృషి చేస్తాను ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.




Post Comment