తూప్రాన్ సుభాష్ విగ్రహం వద్ద అంబలి కేంద్రం ప్రారంభం*
వేసవిలో ప్రజల ఆరోగ్యం తోపాటు దాహార్తి తీర్చడమే లక్ష్యం
సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, గణపతి టెక్స్ టైల్స్ బట్టల దుకాణం సౌజన్యంతో*
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, ఏప్రిల్, 1
శ్రీ సూర్య చంద్ర ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి కాలం గురించి మంగళవారం రోజు సుభాష్ వద్ద “అంబలి పంపిణీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ అంబలి కేంద్రం ప్రతి రోజు ఉదయం 11.00గం. నుండి 12.00 గం.లవరకు ఒక గంట సేపు కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు. మంగళవారం రోజు నుంచి ప్రారంభమైన ఈ వేసవికాలంలో ప్రతిరోజు ఈ అంబలి కార్యక్రమాన్ని శ్రీ గణేష్ బట్టలు దుకాణం యజమాని శివరామ్ దేవసాయి వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ నాయకులు ఆకుల శ్రీరాములు, స్వర్గం వెంకట నారాయణ, ఎక్కళ్ దేవ్ వెంకటేష్ యాదవ్, జంగం రాములు, గణపతి టెక్స్ టైల్స్ బట్టల దుకాణం యజమాని శివరామ్ దేవసాయి, అతని కుమారులు, షాప్ సిబ్బంది, సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




Post Comment