తూప్రాన్ లో 40 మంది ఆశా వర్కర్ల అరెస్టు
పోలీస్ స్టేషన్ కు తరలింపు
*టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు.. ఆశా వర్కర్ల అరెస్
ప్రజా సింగిడి ప్రతినిధి తూప్రాన్. మర్చి, 24.
నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్ జిల్లా ఇందల్ వాయి, సిరికొండ నుండి సి.ఐ.టి.యు పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళుతున్న ఆశా వర్కర్లను తూప్రాన్ పట్టణ 44వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద ఎస్.ఐ శివానందం ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేసి దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం వారిని తూప్రాన్ పోలీస్ స్టేషన్ కు తరలించి సాయంత్రం స్వంత పుచిక పై విడుదల చేసి వారి స్వగ్రామాలకు పంపించారు. సీఐటీయూ పిలుపు మేరకు ఆశా వర్కర్లు హైదరాబాద్ తరలి వెళ్తుండడంతో వాహనాల తనిఖీ చేపట్టారు. మరి కొంత మంది ఆశా వర్కర్లను గుర్తించి వెల్దుర్తి, శివంపేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. సాయంత్రం వారిని స్వంత పుచ్చిక పై విడుదల చేసి తిరిగి వారి వారి స్వంత ఉర్లకు పంపించారు.




Post Comment