డెక్కన్,డెవలప్మెంట్ సొసైటీ,కృషి విజ్ఞాన కేంద్రం, లో శిక్షణ తరగతులు
ప్రజా సింగిడి ప్రతినిధి మర్చి 27 జహీరాబాద్
జహీరాబాద్ నియోజకవర్గం లోని జహీరాబాద్ మండలం, డిడిఎస్ కెవికె ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఎస్సీ రైతులకు పంపిణీ కార్యక్రమం
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి విజ్ఞాన్ కేంద్రం (డి డి ఎస్ -కే వి కే), జహీరాబాద్ ఆధ్వర్యంలో “శిక్షణ మరియు వ్యవసాయ సామగ్రి పంపిణీ కార్యక్రమం” విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (గ్లోబల్ సీ ఓ ఈ), ఐ సీ ఏ ఆర్ -ఐ ఐ యం ఆర్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక (ఎస్ సీ ఎస్ పీ) కింద నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ ప్రస్తావిస్తూ, ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ప్రాధాన్యతను వివరించారు. జిల్లా వ్యవసాయ శాఖల మద్దతుతో అధిక దిగుబడి కలిగిన విత్తనాల వినియోగం, శాస్త్రీయ వ్యవసాయ విధానాల అనుసరణ ద్వారా రైతులు మరింత లాభదాయకంగా వ్యవసాయం చేయగలరని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో కృష్ణ విజ్ఞాన్ కేంద్రం డి డి ఎస్ కే వి కే ద్వారా రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పిస్తున్న విధానాన్ని ప్రశంసించారు. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా రైతులు సేంద్రియ వ్యవసాయ విధానాలను అవలంబించి, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, తెగుళ్ల నియంత్రణతో పాటు వ్యవసాయ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని పొందాలన్నారు. దీని ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందటమే కాకుండా, భవిష్యత్లో స్వయంసమృద్ధి సాధించగలరు అని పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా పప్పుధాన్యాలు (కంది, శెనగ) నూనె గింజల (కుసుమలు) సాగు పై రైతులకు మెరుగైన అవగాహన కల్పించడానికి కేవీక్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డి డి ఎస్) చేస్తున్న కృషిని ప్రశంసించారు.
జహీరాబాద్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ భిక్షపతి మాట్లాడుతూ, ఈ పంపిణీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం రైతులను మెరుగైన సాగు పద్దతులతో పరిచయం చేయడం, నూతన సాంకేతికతల ద్వారా వ్యవసాయ వ్యవస్థను మరింత స్థిరంగా మార్చడం అని తెలిపారు. కేవీక్ ద్వారా రైతులకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత, ప్రదర్శన క్షేత్రాల ఏర్పాటు ద్వారా శాస్త్రీయ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక అధికారి రామచారి మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాల కోసం “రాజీవ్ యువ వికాస్” పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ పథకం కింద గేదెలు (2) లేదా ఇతర వ్యాపారాలను ప్రారంభించేందుకు 90% సబ్సిడీ. 10% బ్యాంకు రుణం అందించబడుతుందని వివరించారు. 70% యంత్రాలకు.. వ్యవసాయ ఇన్పుట్లు, కిరాణా దుకాణాలకు మంజూరు అందుబాటులో ఉందని తెలిపారు. అదనంగా, బోర్వెల్లు, విద్యుత్ సౌకర్యం, మందు పిచికారీ పరికరాలు (స్ప్రేయర్స్) వంటి వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంటాయని, ఈ పథకానికి అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 5 అని తెలియజేశారు.డీడీఎస్ కేవీకే ఎస్సీ రైతు ప్రతినిధి శ్రీమతి మొగులమ్మ మాట్లాడుతూ. గ్రామాల్లో మట్టి పరీక్షలు నిర్వహించబడినట్లు. అలాగే ఎస్సీ మహిళలకు మేకలు, కోళ్లు, జొన్న, కంది, కుసుమ, నాణ్యమైన కూరగాయల నారు పంపిణీ ద్వారా సమీకృత సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఈ సహాయంతో రైతులు తమ ఆదాయాన్ని పెంచుకుంటూ, ఇతర మహిళా రైతులకు ఆదర్శంగా




Post Comment