×

డంపింగ్ యార్డ్ హటావో నర్సాపూర్ బచావో…

డంపింగ్ యార్డ్ హటావో నర్సాపూర్ బచావో

◆డంపింగ్ యార్డ్ హటావో నర్సాపూర్ బచావో ధర్నా లో 15 వ వార్డు మాజీ కౌన్సిలర్, మిత్ర బృందం

ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. మర్చి, 15.

నర్సాపూర్ పట్టణ కేంద్రంలో డంపింగ్ యార్డ్ హటావో నర్సాపూర్ బచావో ధర్నా కార్యక్రమంలో నర్సాపూర్ 15వ వార్డు మాజీ కౌన్సిలర్ బిక్షపతి మరియు వారి మిత్రబృందం ధర్నాలు కూర్చోవడం జరిగింది. వారికి మద్దతుగా మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ధర్నాకు సంఘీభావం తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ను ప్రజల అభిప్రాయం స్వీకరించకుండా నల్లవల్లి అడవిలోని 152 ఎకరాల్లో ఎంతో స్వచ్ఛమైన అడవి వాతావరణాన్ని కల్యుషధం చేయడం ఎంతవరకు న్యాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రజల యొక్క ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని ఈ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొని ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తెలిసేలా కలిసికట్టుగా అందరం పోరాడాలని వారు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రైతు సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Please follow and like us:
Pin Share

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!