ట్యాంకు నిండగానే రహదారిపైకి నీరుబురద మయంగా మారిన రోడ్డు!
ట్యాంకు నిండగానే రహదారిపైకి నీరుబురద మయంగా మారిన రోడ్డు!
శాశ్వత చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్!!
ప్రజా సింగిడి ప్రతినిధి శివంపేట్. అక్టోబర్ 14
శివ్వంపేట మండల కేంద్రంలోని రామాలయం వద్ద ఉన్న మంచినీటి ట్యాంకు నుండి నీరు రోడ్డుపైకి చేరి వృథా అవుతోంది. ట్యాంకు నిండగానే నీరు బయటకు పొంగిపడి, ఆ ప్రాంతం బురదమయంగా
మారి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది.
గ్రామస్తులు పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృధా అవుతున్న నీటిని కోనేరులోకి లేదా డ్రైనేజీలోకి మళ్లించేలా శాశ్వత చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.




Post Comment