టి పి టి ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మరణం.
ఉద్యమాలకు తీరని లోటు…
◆ డీటీఎఫ్ జిల్లా కమిటీ
ప్రజా సింగిడి ప్రతినిధి నిజామాబాద్. ఏప్రిల్, 14.
టిపిటిఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కే. రమణ నేడు అనారోగ్యంతో మరణించడం పట్ల డిటిఎఫ్ జిల్లా కమిటీ సంతాపాన్ని ప్రకటిస్తుంది.
రమణ ఫెడరేషన్, సభ్యునిగా కార్యకర్తగా నాయకునిగా అంచెలoచే లుగా ఎదిగి ఉపాధ్యాయ సామాజిక,ఉద్యమాల పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి పోరాటాల ద్వారానే సమస్యలు సాధన ఉంటుందని ప్రగాఢంగా నమ్మే వ్యక్తులలో రమణ ఒకరు. నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దశాబ్దం పైగా పనిచేసిన రమణ టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి ఉపాధ్యాయునిగా పదవి విరమణ పొందినప్పటికీ ఉద్యమాలే ఊపిరిగా జీవించిన వ్యక్తి, సమస్యల పరిష్కారం లక్ష్యంగా మరణించే వరకు అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన రమణ నేడు మరణించడం ఉద్యమాలకు తీరనిలోటు ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన తెలియజేస్తున్నాం. పి.శంతన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏం. బాలయ్య జిల్లా అధ్యక్షులు , కే.ఒమాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ




Post Comment