జ్యోతి బాపులే జయంతి వేడుకలు…
ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్ ఏప్రిల్,11
మహాత్మా జ్యోతి రావు పులే జయంతినీ పురస్కరించుకొని నర్సాపూర్ చౌరస్తా లో నాయకులు ఘనంగా నిర్వహించరు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు పులే గారు భారత సమాజంలో ఒక అపూర్వమైన మార్పు తీసుకు వచ్చిన మహానుభావుడు, సమాజ సేవలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు కారకులయ్యారు , పులే గారు 1848 లో తన భార్య సావిత్రి బాయి పులే తో కలిసి పూణేలో భారత దేశం లో తొలి బాలికల పాఠశాలను స్థాపించారు,అలాగే 1873 లో స్థాపించిన సత్య శోధక సమాజం ద్వారా కుల వ్యవస్థ,అసృశ్యత,లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత మహాత్మా జ్యోతి రావు పులే గారిదే అని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మల్లికార్జున్ గౌడ్, బీసీ సంఘం నాయకులు, శివ కృష్ణ గౌడ్, దంతేపల్లి నవీన్,మాజీ వార్డు సభ్యులు, పోతారాజ్ ధన్రాజ్,రవి నాథ్, బాలేష్, తదితరులు పాల్గొన్నారు




Post Comment