జుమ్మా నమాజులో ముస్లిం సోదరులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 25.
పహాల్గం లో మొన్న జరిగిన హింస కాండ ను నిరసిస్తూ శివ్వంపేట మండల కేంద్రంలో ని మొహమ్మదియా మస్జీద్ లో శివ్వంపేట ముస్లిం మైనారిటీ యువకులు,పిల్లలు,పెద్దలు,అందరూ నల్ల బ్యాడ్జ్ లు ధరించి జూమా నమాజ్ తరువాత నిరసనలు తెలుపడం జరిగింది.ముస్లిం యువకులు మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి బాధాకరమని,సందర్శనకు వచ్చిన అమాయక ప్రజల పై ఉగ్రదాడి మమ్మల్ని బాధించింది అని అన్నారు,ప్రభుత్వం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని వారు అన్నారు,




Post Comment