జిల్లా యువజన క్రీడల అధికారికి సన్మానం
- జిల్లా యువజన క్రీడల అధికారికి సన్మానం
- మండల విద్యాధికారి బుచ్చా నాయక్.
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. అక్టోబర్, 25.
మెదక్ జిల్లా యువజన క్రీడల అధికారిగా నియమితులైన గంగాల రమేష్ ను శివంపేట మండల విద్యాధికారి బుచ్చానాయక్ శనివారం రోజు ఘనంగా సన్మానించారు శివంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గంగాల రమేష్ ను శాలువా మెమెంటో తో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎంఈఓ బుచ్చా నాయక్ మాట్లాడుతూ శివంపేట గ్రామానికి చెందిన గంగాల రమేష్ వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఈ ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి విశేషమైన కృషి చేయడం జరిగిందని తెలిపారు ఈ ప్రాంతం నుండి క్రీడలలో జాతీయస్థాయి క్రీడాకారులను తయారుచేసిన ఘనత వారి కుందని తెలిపారు. జిల్లాస్థాయిలో ఉత్తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని వారు కొనియాడారు కార్యక్రమంలో శివంపేట,పిల్లుట్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలచంద్రం, శ్రీనివాస్ రెడ్డి ఎస్ జి టి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం, పిఆర్టియు మండల అధ్యక్షులు అనిల్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నర్సాగౌడ్, యాదవ రెడ్డి, మండల కార్యదర్శి బాబా, ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి, సురేష్, చంద్రమోహన్, మహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.




Post Comment