జాతర ఉత్సవాల్లో పాల్గొన్న – ఆవుల రాజిరెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర. మర్చి, 31.
హాత్నూర మండలం సికింద్రాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో, వడ్డేపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో జరిగిన జాతర ఉత్సవాల్లో పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు.*ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో పాటు ఉత్సవ వేడుకల్లో భాగస్వామి అయ్యారు.స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.*ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు..




Post Comment