జర్నలిస్టుల సంక్షేమమే TJU లక్ష్యం…
జర్నలిస్టుల సంక్షేమమే TJU లక్ష్యం…
●అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలి..
◆రాష్ట్ర కార్యదర్శి బాపురావు.
ప్రజా సింగిడి, కామారెడ్డి మే 31:
కామారెడ్డి పట్టణంలో, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి బాపురావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమమే తెలంగాణ జర్నలిస్టు యూనియన్ లక్ష్యంగా పోరాడుతుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని, ప్రైవేట్ పాఠశాలలలో జర్నలిస్టుల పిల్లలకు పూర్తిగా 100% ఉచిత విద్యను అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రతి జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి, మహేష్ గౌడ్ కి, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ కి, ఎటువంటి సంబంధం లేదని, ఇకనైనా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ పేరు వాడిన యూనియన్ తరపున తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శి టి రాజు, ఉపాధ్యక్షులు సంతోష్, గోపాల్, నారాయణ,నరేష్, ముఖ్య సలహాదారులు రవి, శ్రీకాంత్, జిల్లా కమిటీ మెంబర్లు హరీష్, శ్యామ్ రావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు..




Post Comment