చెట్టు విరిగి బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి
చెట్టు విరిగి బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి
ప్రజా సింగిడి ప్రతినిధి సూర్యాపేట. అక్టోబర్, 29.
పొలానికి వెళ్లి వస్తుండగా చెట్టు మీద పడి వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతన్ కల్ మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. మద్దిరాల గ్రామానికి చెందిన కోట లక్ష్మీనారాయణ వయస్సు(50) సం” ఇరవై ఏళ్ల క్రితం MHBD జిల్లా మరిపెడ(M) తానంచర్ల గ్రామానికి వచ్చి మెడికల్ షాపు నిర్వహిస్తూ స్థిరపడ్డాడు. మద్దిరాలలో వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా.. వర్షం, ఈదురు గాలుల కారణంగా చెట్టు విరిగి బైకుపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.




Post Comment