చిన్ననాటి స్నేహితురాలికి ఆర్థిక సాయం అందజేత
• మీ కష్టసుఖాల్లో మేము సైతం అంటూ •
• మానవత్వం చాటుకున్న స్నేహితులు •
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్ 28
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోమంచితనానికి కేరాఫ్ అడ్రస్ స్నేహితులు స్నేహితులంటే విందులు వినోదాలు షికారులకే కాదు ఆపదలో ఉన్న తోటి స్నేహితురాలికి అండగా నిలబడదామని ముందుకు వచ్చారు. మండల కేంద్రమైన కౌడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005 – 2006 బ్యాచ్ కి చెందిన విద్యార్థులు తమతోపాటు పదవ తరగతి పూర్తి చేసుకున్న తోటి స్నేహితురాలు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వప్న కి 18 సంవత్సరాల క్రితం పిల్లి మల్లేష్, తో పెల్లి జరిగింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు తేజస్విని 17 సం ” వైష్ణవి 15 సం ” సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. స్వప్న భర్త పిల్లి మల్లేష్, ఒక నెల క్రితం పని నిమిత్తం కారులో మెదక్ వెళ్లి తిరిగి వస్తుండగా కౌడిపల్లి కొల్చారం మార్గ మధ్యలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కారుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు తీరని లోటు మిగిల్చాడు. కుటుంబంలో పెద్ద దిక్కు అయినా భర్త మల్లేష్ మరణంతో కుటుంబ బరువు బాధ్యతలు మొత్తం భార్య స్వప్న పై పడ్డాయి. విషయం తెలుసుకున్న పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమతో పాటు పదవ తరగతి చదువుకున్న తోటి స్నేహితురాలు స్వప్నకి ఇలా జరగడం తీరనిలోటని తోటి స్నేహితులంతా కలిసి స్వప్న సొంత గ్రామమైన తిమ్మాపూర్ కి వెళ్లి స్వప్న నీ పరామర్శించి స్వప్న కి 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి స్వప్న కి ఏ సమస్య వచ్చినా తమతో నిర్భయంగా పంచుకోవాలని స్నేహితులంతా ధైర్యం చెప్పారు. మీకే సమస్య వచ్చిన మేము మీ కుటుంబంలో ఒకరి మనే సంగతి మర్చిపోవద్దని కుటుంబ సభ్యులకు, స్నేహితురాలు స్వప్నకి, ధైర్యం చెప్పారు. అనంతరం స్వప్న చిన్న కూతురు వైష్ణవి పుట్టినరోజు కావడంతో వైష్ణవి, తో కేక్ కటింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో మిత్రులు, శంకర్, సురేష్, రమ్య, స్వప్న, ఫరీదా, నాగరాజు చారీ, కుమార్, శ్రీహరి, గణేష్, దేవి సింగ్, గోపాల్, ధనరాజ్, మురళి, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.




Post Comment