చరిత్రకెక్కని గిరిజన వీరులను స్మరించుకోవాలి ..
చరిత్రకెక్కని గిరిజన వీరులను స్మరించుకోవాలి ..
ప్రజా సింగిడి
చరిత్రకెక్కని గిరి పుత్రులను స్మరించుకోవాలని భారతదేశంలో గిరిజన ఉద్యమాలు అనేకం జరిగాయని,గిరిజన సమూహాలు తమ సంస్కృతిని కాపాడుకునేందుకు, తమ గిరిజన సామాజిక,రాజకీయ,వ్యవస్థలకు పునఃస్థాపించడానికి గిరిజన వీరులు పోరాట యోధులయ్యారని అందులో తెలిసిన వారు మాత్రమే లిఖించబడ్డారని విస్మత గిరిజన వీరులను స్మరించుకోవాలని
ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కామారెడ్డి, చరిత్రవిభాగం ఆధ్వర్యంలో ‘ గిరిజన ఉద్యమాలు మరియు విస్మృత గిరిజన వీరులు ‘అనే అంశంపై నిర్వహించిన ఒకరోజు కార్యశాల లో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ అన్నారు.
కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే. కిష్టయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రముఖ ఉద్యమకారుల్లో రాంజీ గోండు గోండుల ఆత్మ అభిమానం కాపాడటం కోసం నిర్మల్ కేంద్రంగా నిజం వ్యతిరేక పోరాటాలు చేశారని, గోండులకు ప్రత్యేక రాజ్యం కావాలని జల్, జంగల్, జమీన్ నినాదంతో కొమరం భీమ్ పోరాడారని అన్నారు.
చరిత్ర విభాగ అధిపతి, వర్క్ షాప్ కన్వీనర్ అంకం జయప్రకాష్ గిరిజన ఉద్యమాలు గురించి స్వాగత ఉపన్యాసం చేశారు.
రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించిన చరిత్ర విశ్లేషకులు డాక్టర్ టి. శ్రీనివాస్ విశ్లేషణాత్మక వివరణ ఇస్తూ గిరిజనుల నిర్వచనం, భారతదేశంలో జరిగిన గిరిజన ఉద్యమాలు, వివిధ దృక్పథాలు మరియు తెలంగాణ ప్రాంతంలో గిరిజన ఉద్యమాలు,విస్మృత వీరుల పోరాటాల గురించి వివరించారు.
అనంతరం ముఖ్యఅతిథి డాక్టర్ టి. శ్రీనివాస్ ను కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు శాలువా, మెమొంటో తో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అకాడమిక్ సమన్వయకర్త డాక్టర్ పి. విశ్వప్రసాద్, అర్థశాస్త్ర ఆచార్యులు డాక్టర్ ఏ.సుధాకర్ హిందీ అధ్యాపకులు డాక్టర్ జి. శ్రీనివాసరావు, విభాగతిపతులు డాక్టర్.దినకర్, ఎన్.రాములు , మానస,శ్రీవల్లి అధ్యాపకులు కే. కవిత, విజయ్ కుమార్, మీరాబాయి, రాజేందర్, సత్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.




Post Comment