చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడితే శాఖ పరమైన చర్యలు తప్పవు
• కానిస్టేబుల్ రాజు కుమార్ పై సస్పెషన్ వేటు.
జిల్లా ఇన్చార్జి ఎస్పీ యం. రాజేష్ చంద్ర వెల్లడి
బుధవారం ఉదయం తిమ్మక్కపల్లి సమీపంలో రెండు టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు, మెదక్ రూరల్ ఎస్సై మురళి తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎదురుగా వస్తున్న రెండు టిప్పర్లను ఆపి, వాటిలో ఇసుక రవాణాకు సంబంధించిన వే బిల్లులను చూపించమని డ్రైవర్లను అడిగారు. కానీ వారు ఏవిధమైన పత్రాలు చూపించలేదు.
ఈ సమయంలో కుల్చారం పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రాజు కుమార్ అక్కడికి వచ్చి, ఎస్సై మురళి విధులకు అడ్డంకులు సృష్టించారు. అక్రమ ఇసుక రవాణాదారులకు మద్దతుగా వ్యవహరించడం, వాహనాలకు ఎస్కార్ట్ లా సహకరించడంపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, మెదక్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ యం. రాజేష్ చంద్ర సంబంధిత కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ….”విధుల్లో నిబద్ధతతోపాటు నైతిక విలువలు పాటించాలి. అనైతిక చర్యలు, నిర్లక్ష్యము, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు సహకరించే వారిని ఉపేక్షించము. అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవు.”అని వెల్లడించారు




Post Comment