ఘనంగా హొలీ వేడుకలు…
ఘనంగా హోలీ వేడుకలు…
జహీరాబాద్ , (ప్రజా సింగిడి ప్రతినిధి) మర్చి 14 జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పెద్ద సంఖ్యలో యువకులు యువతులు పిల్లలు వృద్ధులు ఘనంగా వారి వారి గ్రామాలలో హోలీ సందర్భంగా హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ రంగులు వేసుకున్నారు సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే పండుగను సంతోషంగా సంబరాలు చేసుకున్నారు ఉదయం 7 గంటల నుండి గ్రామంలో సందడి కనిపించింది మధ్యాహ్నం 12 గంటల వరకు హోలీ ఉత్సవాల్లో పాల్గొన్నారు ఆలయాల వద్ద కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఒకరికొకరు సంతోషంగా డాన్సులు పాటలు పాడుకుంటూ హోలీ సంబరాలు జరుపుకున్నారు ఆంజనేయ స్వామి, పోచమ్మ, ఆలయం వద్ద ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు. యువకులు రంగులతో శాంతియుతంగా హోలీ పండగలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో యువకులు, తదితరులు పాల్గొన్నారు.




Post Comment