ఘనంగా ఉగాది వేడుకలు…
ఘనంగా ఉగాది వేడుకలు…
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గంగాయిపల్లి గ్రామ యం పి యు పి ఎస్ ప్రభుత్వ పాఠశాల లో తెలుగు కొత్త సంవత్సర విశ్వావసు సంవత్సర ఉగాది వేడుకలు ఘంగంగా జరిపారు. పాఠశాల ఆవరణలో పిల్లలతో ఉగాది పచ్చడి చేయించి షడ్రుచులు యొక్క ప్రాముఖ్యత నీ ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తు విద్యార్థులతో కలసి పచ్చడి స్వీకారించారు. తెలుగు తనం ఉట్టిపడేలా పాఠశాల ఆవరణలో ముగ్గులు మామిడి తోరణాలతో పాఠశాల అద్భుతంగా అలంకరించి మిటా యిలుతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి ప్రసన్న ఉపాద్యాయులు మల్లేశం పిల్లలతో కలిసి ఆనందంగా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.




Post Comment