గోర్ బోలి (లంబాడీ) భాషకు గౌరవం – తెలంగాణ అసెంబ్లీ చరిత్రాత్మక నిర్ణయం !
ప్రజా సింగిడి,కామారెడ్డి
లింగంపేట్ మండలం {పరమళ్ళ} మాలోత్ తండా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్మోహన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
గోర్ బోలి (లంబాడీ) భాషకు గౌరవం – తెలంగాణ అసెంబ్లీ చరిత్రాత్మక నిర్ణయం…
తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడీ) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సందర్భంగా, కామారెడ్డి జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ & ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం యూత్ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రవీందర్, మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వికాస్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పలభిషేకం చేయడం జరిగింది. అలాగే జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కి , “రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ లకి “బంజారా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
భాషా పరిరక్షణలో మరో కీలక ముందడుగు.
ఇది లంబాడా భాషాభిమానులకు గొప్ప గర్వకారణం. ఈ చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తూ, భాషా హక్కుల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ముందడుగు ప్రశంసనీయం అని కొనియాడారు. రాష్ట్రంలో 40 లక్షలు
ఈ దేశంలో 15 కోట్ల మంది బంజారా నాయకులు సంతోషంగా ఉందన్నారు,
ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రకాష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రవీందర్ నాయక్, మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వికాస్, విట్టల్, దశరథ్, లాల్ సింగ్, లక్ష్మణ్, బన్సీ, పవన్, రామావత్ ప్రకాష్, రామ్ సింగ్, బాబు, హరి, పాల్గొన్నారు.




Post Comment