గంజాయి స్వాధీనం…ఎక్సైజ్ పోలీసులు…
6 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు…
ప్రజా సింగిడి – కామారెడ్డి
కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిధిలో ఆరు లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకునట్లు కామారెడ్డి ఎక్సైజ్ సీఐ సంపత్ కుమార్ తెలిపారు.
నిజమాబాద్ జిల్లా (ప్రొహిబిషన్) ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ వి. సోమిరెడ్డి కామారెడ్డి జల్లా ఎక్సైజ్డ్ సూపర్డెంట్ బి. హన్మంతరావు ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది కామారెడ్డి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సహకారం తో సంబాల్ పూర్ నుండి నాందేడు వెళ్ళు నాగవళ్లి ఎక్స్ప్రెస్స్ లో తనిఖీలు నిర్వహించగా ఒక అనుమానస్పదమైన బ్యాగులో సుమారు (12) పన్నెండు కిలోల ఎండు గంటాయి లభించినది అని కామారెడ్డి ఎక్సైజ్ సీఐ. సంపత తెలిపారు. నిందితులు కోసం గాలింపు కొనసాగుతుందని, గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ అమ్మిన రవాణా చేసిన, సేవించిన ఎన్సీపీఎస్ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో కామారెడ్డి ఎక్సైజ్ ఎస్సై. ఏం. విక్రమ్ కుమార్, కామారెడ్డి ఆర్పిఎఫ్ ఎస్ఐ . వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ రవీంద్ర బాబు, సిబ్బంది దేవకుమార్, ఎం.కె. ఆవార్, నరేష్ నాడీ, శ్రీరాగ తదితరులు పాల్గొన్నారు.




Post Comment