గంజాయి అమ్ముతున్న వ్యక్తి ని పట్టుకున్న : డిస్టిక్ టాస్క్ ఫోర్స్ అధికారులు
ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్,మనోహరాబాద్ మార్చ్ 21
మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కాళ్ళ కల్ పారిశ్రామికవాడలో ద్విచక్ర వాహనం పై గంజాయి తరలిస్తున్న సర్కార్ పార్ధు అనే వ్యక్తిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ మెదక్ జిల్లా బృందం ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకొని 205 గ్రాముల గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ గోపాల్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పారిశ్రామిక వాడలో తనిఖీ నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని తనిఖీ చేయగా 205 గ్రాముల గంజాయి దొరికిందని తెలిపారు. అధిక ధరల కోసం గంజాయి వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. సీఐ గోపాల్ మాట్లాడతు ఎవరైనా గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయాలు చేసిన సేవించిన రవాణా చేసే వ్యక్తుల వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు ఈ తనిఖీలలో ఎస్సై బాలయ్య, హెడ్ కానిస్టేబుల్లు చంద్రయ్య, ఎల్లయ్య, సిబ్బంది రాజు, నరేష్, రవి, హరీష్, నవీన్ పాల్గొన్నారు.




Post Comment