కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
ప్రజాసింగిడిమెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మే 5
మెదక్ జిల్లాచిల్పిచేడ్ మండలం సమ్మక్కపేట
ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం చిల్పిచేడ్ మండలం సమ్మక్కపేట కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.
కేంద్ర నిర్వాహకులకు పలు సూచన చేస్తూ తేమ శాతం రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలన్నారు తేమ శాతం వచ్చిన ఏ ఒక్క ధాన్యం గింజ కూడా కేంద్రాల్లో ఉండకుడదని .. కొనుగోలు లో ఎలాంటి ఆలస్యం జరగకూడదన్నారు ఒపీఎంఎస్ లో కూడా ఎప్పటికప్పుడు కొనుగోలు వివరాలు నమోదు చేయాలన్నారు
రైతులు నాణ్యమైన పరిశుభ్రమైన ధాన్యాన్ని కొనుగోలుకు తీసుకు వచ్చినట్లయితే నాణ్యమైన మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, రానున్న 15 రోజులు ఎంతో కీలకమని, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని, కొనుగోళ్ల ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఈ మేరకు కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ప్రతిరోజూ కేంద్రాలను సందర్శించి, పరిశీలించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు




Post Comment