కాశ్మీర్ ఉగ్రవాధుల దాడిని ఖండించిన మహబూబ్ నగర్ లోని పలు సంస్థలు
ప్రజాసింగిడి ప్రతినిధి జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్, 24,ఏప్రిల్.
సనాతన సందేశ కేంద్రం, సమ ధర్మ ప్రచార పరిషద్, బైతుల్ ఖైర్ ఫోండేషన్, సీనియర్ సిటిజెన్ ఫోరం మహబూబ్ నగర్. హిందూ మరియు ముస్లిం నాయకులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.మీడియా సమావేశంలో పలు నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాదానికి కులం, మతం ఉండదు కాబట్టి మృగతత్వం, రాక్షసతత్వం మాత్రమే వారిలో ఉంటుందని హిందువులు, ముస్లింలు కలిసి ఉన్న మన భారత దేశంలో అల్లర్లు సృష్టించడానికి కొందరు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.ఈ దుర్గటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు ఆ సర్వేశ్వరుడు శాంతిని ప్రసాధించాలని ప్రాదిస్తున్నాం, దాడికి పాల్పడిన దూర్మారుగులను ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలని కోతున్నాము.




Post Comment