కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటా -మెదక్ ఎం పి
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర. మర్చి 29.
నర్సాపూర్ నియోజికవర్గం హత్నూర మండల్ రెడ్డి ఖానాపూర్ గ్రామంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు బిజెపి కార్యకర్తల పై దాడి చేయగా… బిజెపి కార్యకర్తలకు చాలా గాయాలు అయ్యాయి ఇదికాకుండా మళ్లీ దౌర్జన్యంగ బిజెపి కార్యకర్తల పైనే కొంతమంది నాయకుల ప్రోత్బలంతో వారిపై అక్రమ కేసులు పెట్టడం జరిగింద ని ఈ విషయం తెలుసుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సంగారెడ్డి లోని జైలుకు వెళ్లి అక్కడ దాడికి గురైన కార్యకర్తలను చూసి వారికి మనో ధైర్యాన్ని చెప్పి ఈ కుట్రపూరిత రాజకీయాలు చేసిన వారిపైన, దాడి చేసిన వారిపైన వెంటనే కఠిన శిక్ష పడేలా చేయాలని అమాయకులైనటువంటి బిజెపి కార్యకర్తలకు వెంటనే నిర్దోషులుగా గుర్తించాలని పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ హత్నూర మండల్ బిజెపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు*




Post Comment