కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
నాణ్యమైన గుణాత్మక విద్య అందించి బలోపితం చేయడమే లక్ష్యం
మంత్రి దామోదర రాజనర్సింహ
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, ఏప్రిల్, 4.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన గుణాత్మక విద్య, సమపాళ్లలో మెనూ అందించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా, కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు తీసుక పోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర్ రాజనర్సింహ అన్నారు. తూప్రాన్ టోల్గేట్ దగ్గర ఉన్న తెలంగాణ రెసిడెన్షియల్ సొసైటీ బాలుర పాఠశాలలో శుక్రవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఆధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేసి మెనూ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ విద్యాసామర్ధ్యాలను, ప్రశ్నలతో జవాబులతో పరీక్షించి, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? పాఠశాలల్లో వసతులు సరిగా ఉన్నాయా? సంబంధిత విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నుంచి సానుకూల సమాధానం రావడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. మంచిగా చదువుకుని వృద్ధిలోకి వచ్చి ఇటు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, తల్లితండ్రులు, సమాజం గర్వించే విధంగా ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ , ప్రిన్సిపల్ మురళి, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment