కవరేజ్ కి వెళ్లిన విలేకర్ పైన ఎక్సైజ్ సీ ఐ కారు డ్రైవర్ హల్చల్
విలేకర్ ఫోన్ గుంజుకొని జూలూమ్
ప్రజా సింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్ 10
మెదక్ ఎక్సైజ్ సీఐ కారు డ్రైవర్ వార్త కవరేజ్ కి వెళ్ళిన విలేకరులపై ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు ఎదుటే విలేకరుల ఫోన్ గుంచుకొని జులుం చేసిన ఘటన గురువారం కొల్చారం మండలం రంగంపేట లో చోటుచేసుకుంది. గురువారం రంగంపేట వైన్స్ లో తనిఖీకి మెదక్ ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు ఎస్సై ఆధ్వర్యంలో సిబ్బంది రంగంపేట వైన్స్ దుకాణానికి వచ్చారు. అధికారులు తనిఖీ చేస్తున్నారని, ఫొటోలు తీయడానికి స్థానిక విలేకరులు వెళ్ళగా ఎక్సైజ్ సీఐ అద్దెకారు డ్రైవర్ విలేకరుల వద్ద ఫోన్ లాక్కున్నాడు. విషయం తెలిసిన స్థానిక విలేకరులందరూ వైన్స్ వద్దకు చేరుకొని ఎక్సైజ్ అధికారులను నిలదీయడంతో ఎక్సైజ్ అధికారులు డ్రైవర్ తీసుకున్న సెల్ ఫోన్ ను ఇచ్చి వైన్స్ వద్ద నుంచి వెళ్లిపోయారు. గతంలో కూడా ఎక్సైజ్ సీఐ కారు డ్రైవర్ పై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి
కారు డ్రైవర్ ను మధ్యవర్తిగా ఉంచుకొని ఎక్సైజ్ సిబ్బంది గత కొన్ని సంవత్సరాలుగా వైన్స్ దుకాణాల యజమానుల వద్ద నుండి, కల్లు దుకాణాల యజమానుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు గతంలో అనేకమార్లు ఆరోపణలు వచ్చాయి. గురువారం ఎక్సైజ్ అధికారుల రంగంపేట వైన్స్ లో తనిఖీ చేస్తుండగా ప్రైవేటు వ్యక్తి అయిన డ్రైవర్ సైతం అధికారులతో కలిసి వైన్స్ గోదాంలో కి వెళ్లి తనిఖీ చేయడం గతంలోని ఆరోపణలకు బలం చేకూర్చింది. ఎక్సైజ్ అధికారుల దాడులకు సంబంధించి కల్లు దుకాణాల యజమానులకు, బెల్టు దుకాణాల నిర్వాహకులకు ముందస్తు సమాచారం ఇస్తూ దుకాణాల నిర్వహకులకు , ఎక్సైజ్ అధికారులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ డ్రైవర్ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి




Post Comment