కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం మహోత్సవం*
ప్రజాసింగిడి ప్రతినిధి హత్నూర. ఏప్రిల్ 6.
హత్నుర మండలం సిరిపురం గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని. శ్రీ రాముల వారి దేవాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల విందుగా ఘనంగా, నిర్వహిచరు. కళ్యాణానికి సీతమ్మ వారి తరఫున: చిలకామారి నరోత్తం రెడ్డి సతీమణి మాళవి రాముల వారి తరఫున: భోజ నరేందర్ సతీమణి పద్మ కళ్యాణం నిర్వహించారు. సీతమ్మ వారికి తాళిబొట్టు, మెట్టలు ,భక్తులకు,అన్నదానము, నిర్వహించిన దాతలు భోజ నరేందర్, నరోత్తం రెడ్డి. సిరిపురం గ్రామం వాస్తవ్యులు. కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామం ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణం వీక్షించడం జరిగింది.




Post Comment