ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి..
ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి..
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి జూన్ 10
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని హోంగార్డు మృతి చెందిన సంఘటన మంగళవారం కొల్చారం మండలం కిష్టాపూర్ శివారులో జరిగింది. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కౌడిపల్లి మండలం ఇబ్రహీంబాద్ దుర్గా తండాకు చెందిన మెగావత్ శివరాం (44) మెదక్ పట్టణంలోని భరోసా కేంద్రంలో హోంగార్డు గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన విధులకు హాజరు కావడానికి ఇంటి నుండి మెదక్ కు వెళ్తుండగా మార్గమధ్యలో కిష్టాపూర్ శివారులోని హనుమాన్ బండల్ ప్రాంతంలో మెదక్ వైపు నుండి పోతంశెట్టిపల్లి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్ పై వెళుతున్న శివరాం ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో శివరాం అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.




Post Comment