ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి
*విద్యార్థుల పోరాటానికి కేవీపీఎస్ సంపూర్ణ మద్దతు*
*కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేళా మాణిక్
ప్రజా సింగిడి ప్రతినిధి సంగారెడ్డి. మార్చు 22
ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలను నిషేధిస్తూ వైస్ ఛాన్సలర్ జారీ చేసిన సర్క్యులర్‌ను తక్షణమే ఉపసంహరించుకొని యూనివర్సిటీ ప్రజాస్వామిక హక్కులను రక్షించాలని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ డిమాండ్ చేశారు.. సంగారెడ్డి లో జరిగిన సమావేశంలో అతిమేల మాణిక్ మాట్లాడుతూ ఉపసంహరించుకోవాలని విద్యార్దులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు
ఉస్మానియాకు దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు యూనివర్సిటీలలో సమస్యలపై నినదించే శక్తుల గొంతులు నొక్కేయ్యడమేనని చెప్పారు ఆ సర్క్యులర్ రాజ్య స్ఫూర్తికి విడరుద్దంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం, వామపక్ష పోరాటాలు, విద్యార్ధుల సమస్యలపై జరిగిన పోరాటాల పురిటిగడ్డగా వెలుగొందిందన్నారు మహనీయుల జయంతులు వర్ధంతులు సామాజిక న్యాయంకోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక భావాలపై చర్చలు జరుగుతున్న కేంద్రంగా ఉందన్నారు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల్లో అన్యాయం జరిగిందన్న అంశాలపై నిరసనలు తెలిపి ప్రజలను చైతన్యం చేసే కేంద్రంగా వున్న చరిత్ర కల్గిన యూనివర్సిటీగా ఉన్నదన్నారు నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. విద్యార్ధుల వాక్ స్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛను హరించే విధంగా వున్న ఈ అప్రజాస్వామిక సర్క్యులర్‌ను తక్షణమే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించే విధంగా చూడాలని కేవీపీఎస్ డిమాండ్ చేస్తున్నదన్నారు..
ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్ రాజు సంతోష్ జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్, మల్లేశం దాస్ తదితరులు పాల్గొన్నారు..




Post Comment