×

ఉచిత వైద్య శిబిరం

ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్ . మే ,11.

నర్సాపూర్ మండల్ బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని BIGTV & నర్సాపూర్. KAK. హాస్పటల్ వారి సౌజన్యంతో మెగా ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి  కాంగ్రెస్ నాయకులు ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ . రిబ్బన్ కట్ చేయడం జరిగింది. అలాగే వారు వచ్చినటువంటి రోగులు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మీ యొక్క హెల్త్ పరంగా ఏ సమస్యలు ఉన్నా డాక్టర్ కి సంప్రదించి మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది అలాగే బిపి & షుగరు టెస్టులు చేయడం జరిగింది. మోకాళ్ళ గుజ్జులు అరిగినవారికి 20వేల రూపాయలు ఖరీదు చేసే ఇంజక్షన్ వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఎలాంటి సమస్యలు ఉన్న మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని ఆ యొక్క గ్రామ ప్రజలకు వారు ప్రసంగించడం జరిగింది. వచ్చినటువంటి ముఖ్య అతిథులకు గౌరవంగా BIG &KAK హాస్పటల్ వారి తరఫున శాలువాతో సన్మానం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కమటాల సాయి కిరణ్ . మాజీ సర్పంచ్ ఆకుల నర్సింలు . డాక్టర్ సుదీర్ . గంట రమేష్ . కొండలు . విశ్వ. బండారి సాయి కిరణ్. బి జి ఆర్ యువసేన అధ్యక్షులు కుమ్మరి నాగరాజు . గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!