ఉగాది ఆధ్యాత్మిక ఆనందం…
ఉగాది ఆధ్యాత్మిక ఆనందం: అవధూత గిరి..!
– దత్తగిరిలో ఘనంగా ఉగాది ఉత్సవాలు
ప్రజా సింగిడి ప్రతినిధి మర్చి 30 జహీరాబాద్
జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం బద్రిపుర్ ఆశ్రమం లో ప్రశాంతతకు ప్రకృతి నిలయమైన బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఆదివారం తెలుగు సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం గణపతి పూజ, గోపూజ, జ్యోతిర్లింగాలకు రుద్రాభిషేకం, నిత్య పూజలు, దత్తాత్రేయ స్వామి వారి పాదపూజ నిర్వహించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదానం, ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. సాయంత్రం జ్యోతిర్లింగాల ఆలయం వద్ద పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ తెలుగు ప్రజలకు “శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఉగాది అంటేనే ఆధ్యాత్మిక శోభ అని, తెలుగు లోగిళ్ళు వుట్టిపడే పండుగ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాతృ శ్రీ అనసూయ మాత, నందిని గిరి మాత, అర్చకులు శ్రీపాద స్వామి, విశ్వ మానవ ఆధ్యాత్మిక ధర్మసభ సభ్యులు కోట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నారాయణ స్వామి, వైదిక పాఠశాల విద్యార్థులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment