ఈ నెల 12 న నాంచారమ్మ దేవాలయ జాతర

ముఖ్య అతిథులుగా:
రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క *
గండ్ర సత్యనారాయణ రావు జయశంకర్ భూపాలపల్లి శాసనసభ్యులు
ములుగు జిల్లా కలెక్టర్
ప్రజా సింగిడి ప్రతినధి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం . మే 09.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజాపురంలో 800 సంవత్సరాల క్రితం కాకతీయ రాజు నిర్మించిన ఎరుకల నాంచారమ్మ దేవాలయ జాతర తేదీ 12 మే 2025 వైశాఖ శుద్ధ పౌర్ణమి సోమవారం రోజున నాంచారమ్మ జాతర రంగ రంగ వైభవంగా డప్పు సప్పులతో తాళ మేలాలతో బోనాలతో శివసత్తుల తో ఊరేగింపుగా అమ్మవారి జాతర జరపబడును.కావున దయచేసి ప్రాచీనమైన, ప్రాముఖ్యతమైన ఎరుకల జాతికి ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం అయినటువంటి నాంచారమ్మ జాతరకు ఆదివాసి ఎరుకల కులస్తులు నాంచారమ్మ భక్తులు అధిక సంఖ్యలో హాజరై కోరికలు మొక్కులు చెల్లించుకోని విజయవంతం చేయాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ మరియు తెలంగాణ ఆదివాసి ఎరుకల యువజన సంఘం రాష్ట్ర కమిటీ
తెలంగాణ ఆదివాసి ఎరుకల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ మరియు తెలంగాణ ఆదివాసి ఎరుకల విద్యార్థి సంఘం తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం 33 జిల్లాల కమిటీల తరఫుతెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంతరుపున కోరుచున్నాము.




Post Comment