ఆర్మీ జవాన్ కు ఘనంగా సన్మానం
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. జూన్, 17.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పెద్ద గొట్టుముక్కల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆపరేషన్ సింధూరులో పాల్గొని స్వగ్రామానికి విచ్చేసిన సందర్భంగా జడ్పీ హెచ్ ఎస్ హై స్కూల్ లో ఆర్మీ జవాన్కి ఘనంగా స్వాగతం చెప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆపరేషన్ సిందూర్ లో చనిపోయిన అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు.




Post Comment