ఆర్టీసీ బస్సు, కారు ఢీ. మృతి చెందిన యువకుడు
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 27.
ఆర్టీసీ బస్సును కారుఢీ కొని యువకుడు మృతి
చెందిన సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి,శభాష్ పల్లి రోడ్డు మార్గంలో మధ్యలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం
నల్లవల్లి గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ 19,
తూప్రాన్ లో షాపింగ్ చేసుకొని తూప్రాన్ నుండి
నర్సాపూర్ వైపు కారులో ఏ పి 28బి హెచ్ 1429
వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. శ్రవణ్కుమార్ ను 108లో తూప్రాన్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి
చెందాడు. ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. కేసు నమోదు
చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. కొన్ని రోజుల క్రితం దాదాపుగా అదే సమీపంలో నల్లవల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి బస్సు డి కొట్టడం తొ మరణించిన విషయం జరిగింది. సమీపంలో లో ఫంక్షన్ హల్ ఉండటం తొ దొంతి, శబాష్ పల్లి రెండు గ్రామాల ప్రజలు రోడ్డు కు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరుకుంటున్నారు




Post Comment