అసెంబ్లీ సమావేశంలో క్యాబినెట్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్నికి పాలాభిషేకం
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. మర్చి, 19.
నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో బిసి రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదం తెలుపుతూ అసెంబ్లీ సమావేశంలో క్యాబినెట్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్నికి పాలాభిషేకం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ .ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా నలుగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బీసీలకు రాజకీయ, ఉద్యోగ, విద్య, ఆర్థిక రంగాలలో 42 శాతానికి రిజర్వేషన్ల పెంపు బిల్లు,ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం చారిత్రాత్మకమని అన్నారు.కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టి.. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ఆమోదం పొందడం అభినందనీయం. ఎన్నో ఏళ్లుగా చిరకాల కోరికగా ఉన్న ఎస్సీ వర్గీకరణ అమలుకు ముందడుగు పడడం సంతోషకరం.ఈ చరిత్రత్మకు బిల్లు ఆమోదం ద్వారా అమరవీరుల ఆకాంక్ష నెరవేరేలా సామాజిక తెలంగాణ కు తెలంగాణ రాష్ట్రం పునాదులు వేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇంతటి సంతోషాన్ని పల్లెల్లో ఇంటింటికి చేరేలా పెద్ద ఎత్తున నెలరోజులపాటు సంబరాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్త, నర్సాపూర్ మాజీ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, లలిత నర్సింగ్, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్, హత్నుర మండల అధ్యక్షులు క్రిష్ణ, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీలు అశోక్, మేఘమాల, నర్సాపూర్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, నర్సాపూర్ మండల్ ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్, నర్సాపూర్ మండల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు అజ్మత్,రాధాకృష్ణ, రషీద్, నర్సాపూర్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయకుమార్, సుధీర్ కుమార్ గౌడ్, ఆంజనేయులు, మోహన్ దాస్ గౌడ్, కృష్ణ గౌడ్, సందీప్ శ్రీశైలం యాదవ్,దశరత్ గౌడ్, నగేష్, కృష్ణ గౌడ్, రవి గౌడ్, సాగర్ యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




Post Comment