అమ్మ మాట- అంగన్వాడి బాట
అమ్మ మాట- అంగన్వాడి బాట
◆అంగన్వాడి విద్య- పిల్లలకు మొదటి అడుగు.
◆అంగన్వాడి చిన్నారులకు- ఆటపాటలతో విద్య.
◆అంగన్వాడి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన సిడిపిఓ. పద్మశ్రీ
ప్రజా సింగిడి,భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 10:
భద్రాద్రి కొత్తగూడెం అర్బన్,రామవరం సెక్టార్, రామవరం 4 సెంటర్ లో అంగన్వాడీ – అమ్మఒడి…. బడి బాట ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం కి ముఖ్య అతిధిగా సిడిపిఓ మేడం పద్మశ్రీ , సూపెర్వైషర్ పార్వతీ విచ్చేసి వీధి, వీధి పిల్లలతో ఓల్డ్ పోలిస్టేషన్ ఏరియా, నెహ్రు భాస్తి ర్యాలీ చైయడం జరిగింది. సిడిపిఓ పద్మశ్రీ మాట్లాడుతూ.. ఈ నెల 10 నుంచి 17 వ తేది వరకు బడి బాట ప్రోగ్రాం చెయ్యాలి.అంగన్వాడీ- పిల్లలకు విద్య మొదటి అడుగు.అట పాటలతో విద్య.ఇంగ్లీష్ & తెలుగు రైమ్స్. కథలు, పాటలు, సృజనాత్మకత కృత్యాలు. చదవాడికి, వ్రాయడానికి కావాల్సిన నైపుణ్యాల పై ప్రత్యేక శ్రద్ధ.అంగన్వాడీ కేంద్రాలలో అందుతున్న సౌకర్యాల ను పిల్లల తల్లిదండ్రులకు వివరించాలి, అలానే కిషోర బాలికలకు పల్లి చిక్కి తోపాటు కౌన్సలింగ్ కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది.ఇందులో పాల్గొన్న వాళ్ళు రామవరం సూపర్వైజర్ పార్వతి అంగన్వాడీ టీచర్స్ రాధికా,నాగమణి, జ్యోతి,మంగ తాయి, మంజు, హెల్పర్స్ నిర్మల, భవాని, వరలక్ష్మి.. పిల్లలు కిషోర బాలికలు తల్లులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment