అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
ప్రజా సింగిడి ప్రతినిధి చిలిప్ చెడ్. మర్చి, 17.
ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున ఘటన చిలిపిచేడు మండలంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మండల పరిధిలో నీ చండూరు గ్రామానికి చెందిన దూదేకుల ఇమామ్ ఇటీవల తన ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. ఇందుకు భారిగా అప్పులు చేయాల్సి రావడంతో కుటుంబ పోషణ కోసం హైదరాబాద్ వలస వెళ్లాడు. అయితే అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆదివారం స్వగ్రామంనికి చేరుకున మా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ ఘటనతో కుటుంబ సభ్యుల శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న భార్య ఫాతిమా పోలీసులకు ఫిర్యాదు చేయగా. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు




Post Comment