అదనపు కట్నం వేధింపులు – కేసు నమోదు చేసిన ఎస్సై
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 8.
అదనము కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు శివ్వంపేట ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన కర్రి సత్యమ్మను కర్రే మైసయ్య 12 సంవత్సరాల క్రితం రెండో వివాహం చేసుకోగా ఒక సంవత్సరం బాగానే చూసుకున్నాడు ఆ తర్వాత అతని తల్లి అతని ఆడపడుచుల మాటలు విని భార్యను మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టగా పెద్ద సమక్షంలో మాట్లాడిన అతనిలో మార్పు రాలేకపోగా గత రెండు సంవత్సరాల నుండి నన్ను పనికి పంపిస్తూ వచ్చిన డబ్బులతో అతను మద్యం సేవిస్తూ నన్ను శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడని పెళ్లి సమయంలో కొంచెం వరకట్నం ఒప్పుకోగా మరింత తీసుకురమ్మని బాధ పెడుతున్నడని బాధితురాలు ఫిర్యాదు చేయగా భర్త మైసయ్య అత్త సత్తమ్మ ఆడపడుచులు కొత్తపేట మల్లమ్మ కొత్తపేట మంజుల పై కేసు నమోదు చేసినట్లు శివ్వంపేట ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు




Post Comment