అక్రమ ఇసుక ఫిల్టర్ నిర్వహుకుల అరెస్ట్
ఏడుగురుని తహసీల్దార్ ముందు బైండోవర్
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్ ,తూప్రాన్, ఏప్రిల్,11.
వాల్ట చట్టం ఉల్లంఘించి అక్రమంగా ఇసుక ఫిల్టర్ లు ఏర్పాటు చేసుకొని మట్టిని కడిగి ఇసుక అమ్ముకుని సొమ్ము చేసుకునే ఏడుగురు నిర్వహుకులను అరెస్ట్ చేసి తూప్రాన్ తహసీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు ఎస్ ఐ శివానందం తెలిపారు. కిష్టాపూర్, గుండ్రెడ్డిపల్లి, నాగులపల్లి గ్రామ శివారుల్లో హాల్ది వాగు పరిసర ప్రాంతాల్లో నీటి తో మట్టిని కడిగి ఇసుక అమ్ముకుని సొమ్ము చేసుకునే ఏడుగురు నిర్వహుకులైనా కిషోర్, విష్ణు వర్ధన్ రెడ్డి, నవీన్, కిష్టాపూర్ శ్రీశైలం, నాగులపల్లి శ్రీశైలం, మధు లను శుక్రవారం అరెస్ట్ చేసి తూప్రాన్ తహసీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు ఎస్ ఐ శివానందం తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.




Post Comment