అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్, మనోహరాబాద్ మార్చ్, 18
మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కూచారం గ్రామం వద్ద గల పంజాబీ దాబా వద్ద హైదరాబాద్ వైపు నుండి నాగపూర్ వైపు అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం గల లారీని పోలీస్ ఎస్ఐ సుభాష్ గౌడ్ డిపార్ట్మెంట్ మనోహరాబాద్ మరియు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వారిని విచారించగా శ్రీశైలం రోడ్ నుంచి వస్తూ మహారాష్ట్రకు తీసుకొని వెళుతున్నారని తెలిసినది దాని డ్రైవర్ పేరు షేక్ మోహిత్ సన్నాఫ్ షోయబ్ మహారాష్ట్ర అని తెలిసినది డ్రైవర్ పై మరియు లారీ ఓనర్ పై మరియు పిడిఏస్ బియ్యాన్ని తరలిస్తున్న ఓనర్ పై ముగ్గురిపై ఆర్ ఐ దీక్షిత్ మనోహరాబాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఈ లారీలో సుమారుగా 300 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ కలవు ఈ రైస్ ని సేఫ్ కస్టర్డ్ నిమిత్తం ఎం ఎల్ ఎస్ తూప్రాన్ కి తరలించడం జరిగింది అని ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు




Post Comment