అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన పోలీసులు…
అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన పోలీసులు…
జహీరాబాద్ (ప్రజా సింగిడి):
జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్ మండలం గణేష్ పూర్ గ్రామ శివారులో నిమ్జు ప్రాజెక్టులో ఆ భూములకు ప్రభుత్వము నష్టపరిహారం ఇచ్చిన కొంతమంది అక్రమ దారులు అక్రమంగా ఎర్ర రాయి ని తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను జప్తు చేసినట్లు హద్నూర్ ఎస్సై చల్లా రాజశేఖర్ పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాల్ని తనిఖీ చేస్తున్న క్రమంలో గణేష్ పూర్ గ్రామం నుండి రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తుండగా వాటిని పట్టుకొని వివరాలు అడగగా ఎర్ర రాయికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడం తో ఎర్ర రాయిని అక్రమంగా తరలిస్తున్న ఆ రెండు ట్రాక్టర్లు స్వాధీన పరుచుకొని న్యాల్కల్ మండల తాసిల్దార్ కు అట్టి వాహనాలను అప్పగించామని ఎస్సై చల్లా రాజశేఖర్ వివరాలు వెల్లడించారు.




Post Comment