అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన మాజీ కౌన్సిలర్
*ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారన్నారు*
*అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం*
ప్రజా సింగిడి ప్రతినిధి కామారెడ్డి. ఏప్రిల్, 14.
కామారెడ్డి 6వ వార్డులో సరంపల్లి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ నాయకులు కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజ నీతిజ్ఞుడు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయాన్ని, దేశ సమగ్రతను సాటి చెప్పిన, భారతజాతి ముద్దుబిడ్డ, అంటరానితనం వివక్షలపై, అలుపెరుగని పోరు చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.అంబేద్కర్ జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చే ఒక అద్భుత గాథ అన్నారు. అసాధారణమైన మేధాశక్తి కలిగిన అంబేద్కర్, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తన చదువును కొనసాగించారని, ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. బరోడా మహారాజు సాయంతో కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివి అర్థశాస్త్రం, న్యాయశాస్త్రం, రాజనీతి శాస్త్రాలలో అత్యున్నత డిగ్రీలు పొందారు. ఆయన జ్ఞాన సంపద అపారమైనదన్నారు. అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు ఆరాద్యులన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ రాజు, మాజీ సర్పంచ్లు ముల్కరాజు, ఎం నాగయ్య, ఎన్ గంగాధర్, మాజీ ఎంపీటీసీ బాల్ రాజు, నాయకులు కె సాయిలు, బి హనుమాన్లు, ఎం అంజన్ కుమార్, ఎం శ్రీనివాస్, కె గోపాల్, జి శ్రీనివాస్, కె శేఖర్, హెచ్ రాజు, కె రాజు, ఎం స్వామి, ఎం శేఖర్, పి శ్రీనివాస్, ఏ లక్ష్మీపతి, ఎస్ నవీన్, కె సాయిలు, ఎస్ ఆంజనేయులు, జి బాలరాజు, కె అంజి, కె స్వామి రాజు, ఎం రాజేందర్, ఎస్ రాజు, టి సిద్ధ రాములు, పి విట్టల్, కె భాస్కర్, ఎన్ నర్సింలు, గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment