అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి.
ప్రజా సింగిడి ప్రతినిధి రాజపూర్ మండలం, జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా మార్చి,16.
రాజాపూర్ మండలం తీర్మాలపూర్ గ్రామ పంచాయతీలోని నర్సంపల్లి తండాకు చెందిన కేతావత్ దస్రు నాయక్(60) అనారోగ్యంతో మరణించారు.మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/- రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాజాపూర్ మాజీ ఎంపీపీ సుశీల రమేష్ నాయక్,తిరుమలాపూర్ మాజీ ఉప సర్పంచ్ శంకర్ నాయక్, నర్సంపల్లితాండా పార్టీ ప్రెసిడెంట్ రాజారాం నాయక్,లస్కర్ నాయక్,సంతోష్ నాయక్,రెడ్యానాయక్,రవి నాయక్, బాసు నాయక్, శివాజీ నాయక్,లచ్చి రామ్ నాయక్, తండా వసూలు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment