అంగన్వాడి పిల్లల గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్
ప్రజా సింగిడి ప్రతినిధి బొల్లారం ఏప్రిల్ 17
సంగారెడ్డి జిల్లా బొల్లారం గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 19 అంగన్వాడి సెంటర్ల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని గడ్డపోతారం మున్సిపాలిటీ. లక్ష్మీపతి గూడెంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని CDPO జైరాం నాయక్ ICDS సూపర్వైజర్ మీరా బాయి తో కలిసి మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ గారు మాట్లాడుతూ పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు విద్యాబోధన నేర్చుకోవడం వల్ల మరింత జ్ఞానాన్ని పెంచుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆడుకోవడానికి పరికరాలు డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అనేకమైన విషయాలు పిల్లలు నేర్చుకోవడం చాలా సంతోషకరమని రాబోయే రోజుల్లో ఈ పిల్లలకు ఉన్నత చదువులకు ఇలాంటి వాతావరణం చాలా తోడ్పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లావణ్య .అశోక్. కృష్ణ రమేష్ ఆంజనేయులు గ్రామస్తులు పాల్గొన్నారు




Post Comment