అంకిత భావంతో పనిచేసిన ఉపాధ్యాయులందరికి అభినందనలు
మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ పార్వతీ సత్యనారాయణ
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, ఏప్రిల్,30.
తూప్రాన్ మండల్ లోని అన్ని విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులకు, అంకితభావంతో పనిచేసిన ఉపాధ్యాయులకు తూప్రాన్ మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ పార్వతీ సత్యనారాయణ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మీ పట్టుదల, క్రమశిక్షణ మరియు విద్యా దృష్టి నిజంగా ప్రశంసనీయం అని అన్నారు. తూప్రాన్ మండలం మెదక్ జిల్లాలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మండలంగా గుర్తింపు పొందడం చాలా గర్వకారణంగా ఉంది అని అన్నారు. విద్యార్థులు 590, 588, 586, 585, మరియు 580 మార్కులను సాధించండం సంతోషకరమని అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో అత్యధిక స్కోరు 595 ఉండగా, తూప్రాన్ మండల కేంద్రంలో 590 మార్కులు రావడం వెనుక ఉపాధ్యాయుల కృషి అనితరమని అన్నారు. విద్యాపరమైన నైపుణ్యం, ఆవిష్కరణ మరియు సమగ్ర విద్యార్థి అభివృద్ధి సంస్కృతిని పెంపొందించడం ద్వారా ఈ ఉన్నత పథాన్ని కొనసాగిద్దామని ఎం.ఈఓ డా.పర్వతి సత్యనారాయణ పిలుపునిచ్చారు.




Post Comment